మహిళా సాధికారత కోసం....!

      మన దేశంలో, రాష్ట్రంలో సగం భాగం మహిళలు వున్నారు మీరు అంతా తలుచుకుంటే దేశ చరిత్ర,నిర్మాణం మారిపోతుంది తొలిఆధునిక సమాజం మొదలయిననాటికి స్వాతంత్ర్య పొందిన మొదటి దేశాలలో మహిళలకు సరైన గౌరవం దక్కలేదు, ప్రపంచం మొత్తంలో మన భారతదేశ స్త్రీలకు మాత్రమే రాజ్యాంగం రాసిన తొలినాటికే వారికీ సమానత్వం ఇవ్వబడింది. చరిత్రను ఒక్కసారి చుస్తే దాదాపు 215 సంవత్సరాల క్రితం అమెరికాలో రాజ్యాంగం వచ్చాక మహిళలకు ఓటు హక్కు పొందటం జరిగింది. అ దేశా రాజ్యాంగం రాస్తున్నప్పుడు అబిగేయిల్ యడామ్స్ అని, జాన్ యడామ్స్ గారి భార్య అ దేశంలో రాజ్యంగా నిర్మాణంలో కిలకమైన వారిలో ఒకఆయన. అ దేశానికి రెండవ రాష్ట్రపతి ఆయన.ఆమె భర్తకు ఉత్తరం రాస్తూ. “మీరు గోప్ప రాజ్యంగాన్ని ప్రపంచంలో మెట్టమొదటి సారిగా రాస్తున్నారు. దయచేసి మా మహిళల సంగతి మరిచిపోకండి” అని రాసింది. అయినా వాళ్ళు మరిచిపోయారు. అలాగే ,బ్రిటన్ లో 500 సంవత్సరాల పోరాటం లో 1928 సంవత్సరంలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది.,ప్రెంచ్ కు 1790 లో స్వాతంత్ర్య వచ్చాక చాలా కాలం మహిళల సమానత్వం,హక్కుల కోసం పోరాటం చేసి వారి హక్కులను సాధించుకొన్నారు.
అలాంటిది మనదేశంలో రాజ్యాంగం వచ్చిన తోలి రోజునే,కులం,మతం,భాష,ప్రాంతం,లింగ వివక్ష ఇవ్వని విస్మరించి వయోజన ఓటు హక్కు ఇస్తూ, మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు.ప్రపంచ రాజ్యంగాలలో మహిళలకు రాజ్యంగం వచ్చిన తోలి రోజునే ఓటు హక్కు ఇచ్చినటూవంటి తోలి రాజ్యాంగం భారత రాజ్యాంగం.
స్వాతంత్రం వచ్చిన తోలీ నాటి నుండి కూడా మన దేశ రాజకీయ్యలో, మగవారితో పోటీ పడటం లో వారి స్థానం అంతంతే ఉంటూ వస్తుంది కానీ ఆధునిక సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు ముందు వుండి వారి వ్యక్తి గత జీవితాలను బాగుచేసుకోవడమే కాకా కుటుంబ బాధ్యతలను కూడా చూసుకుంటూ సమాజంలో తమవంతు భాద్యతను నిర్వహిస్తున్నారు.ఆర్థికరంగాన్ని, వ్యవసాయ రంగంలో తమదైన శైలి లో ముందుకు వెళుతున్నారు కానీ అతికీలకమైన రాజకీయ రంగంలో మాత్రం వెనుకబడ్డారు.
మన దేశంలో వున్నా 63 కోట్ల మంది మహిళల తరుపున తమ సమస్యలను పరిష్కరించడానికి, హక్కులను కాపాడుకోవడానికి లోక్ సభ లో కేవలం 65 మంది మహిళలు మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లోక్ సభ లో మహిళా భాగస్వామ్యం 12.0% మాత్రమ ఉండటం మన దేశ రాజకీయాలు వారికీ ఇస్తున్న సమానత్వం ఏ స్ధాయిలో వుందో తెలుస్తుంది. రాజ్యసభలో మహిళా సభ్యులు 243 గాను  31 ప్రాతినిధ్యం వహిస్తున్నారు అది కేవలం 12.8% మాత్రమే.
ఎంతోకాలంగా మనదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్(33%)ను పార్లమెంట్ ఆమోదం పొందలేకపోతుంది ఇప్పుడున్న ప్రభుత్వలు మహిళల మీద సవితి తల్లి ప్రేమ చూపుతున్నాయి తప్ప వాటిని అమలు చెయ్యడానికి మాత్రం చేతులు రావటం లేదు,సమస్యల మీద ఆలోచించకుండా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు.
       మన కన్నా పాకిస్థాన్ లో మహిళలకు రాజకియ్యలో సముచిత స్థానం ఇచ్చారు ఈవిషయం లో పాక్ ను చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం వుంది పాకిస్థాన్ లోక్ సభలో మహిళలు 2013 లో మొత్తం 340సభ్యులకుగాను 70 మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మొత్తంగా చుస్తే 20.6% గా వుంది ,రాజ్యసభలో 2015 లో 104 సభ్యులకుగాను 19 మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మహిళ బాగాస్వామ్యం 18.3% గా వుంది,
చైనా లో పార్లమెంట్ లో మొత్తం సభ్యలు 2959 లకుగాను 699 మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మొత్తంగా  23.6% మహిళలు అధికారం చేపడుతున్నారు.,
మన దేశా యూనియన్ కాబినెట్ లో 7మంది మహిళలమినిస్టర్స్ ఉండగా  మొత్తంగా 26% మాత్రమే మహిళా ప్రాధాన్యత వారికీ దక్కింది.
 మన తెలుగు రాష్ట్రల విషయానికి వస్తే మహిళల మీద అధికార పార్టీ చూపితున్న తీరు ఇప్పటివరకు ఎవ్వరు చేసివుండరేమో అనిపిస్తుంది.అంత చేతకానీ వారు మనని పరిపాలిస్తున్నారేం అన్నా సందేహం కలుగుతుంది.
 తెలంగాణ లో 2014 లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేట్టపుడు ఆ జాబితా లో 21 మహిళా అభ్యర్థులకు మాత్రమే టికెట్స్ ఇవ్వడం జరిగింది,
 ఇప్పుడున్న తెలంగాణ శాసన సభలో 9 సభ్యులు మాత్రమే ఎన్నికయ్యారు,అన్నిటికన్నా దురదుష్టం తెలంగాణ రాష్ట్ర సమితి ఏఒక్క మహిళకు మంత్రి వర్గంలొ స్థానం కల్పించలేదు ఇలాంటివాళ్ళు బంగారు సమాజాన్ని తీసుకొస్తామంటూ చెప్పుకొని తిరుగుతున్నారు.
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే కి గాను 20 మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు అందులో ఏపీ కాబినెట్ లో 20 మంది సభ్యులులో  పరిటాల సునీత, పీతల సుజాతకు మాత్రమే తెలుగుదేశం మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది.
             కేవలం కొన్ని సందర్భాలలో మగవారి స్థానంలో మహిళలు వచ్చేసి రాజకీయంలో పాత్ర తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు.రాజకీయం అంటే నేర ప్రవృత్తి, అవినీతి,రాజకీయం మారదు అనే బావన ప్రజల మనసులో బాగా చొరబడిపోయింది. దాని నుండి బయట పడటానికి మహిళలు ఆ నాయకత్వాని తీసుకున్నట్లు అయితేనే ఆ అభిప్రాయంపోతుంది. పార్లమెంట్ గాని, శాసనసభ గాని ,ప్రభుత్వాలలో గాని, రాజకీయ్యాలలో కానీ, బహిరంగ చర్చలలో ప్రమాణాలు బాగుపడతాయి కేవలం తిటుకోవటం, అరుచు కోవడం, గందరగోళం కాకుండా హేతుబద్దమైన వాదనలతో, వాస్తవాలతో ప్రజా సంక్షేమానికి అనుగుణంగా చర్చలు జరుగుతాయి. అధికారానికి అర్థం మారుతుంది. నిజానికి అధికారం అంటే విద్యను, ఆరోగ్యంని అందించటం కావాలి, నైపుణ్యాలను పెంచడం కావాలి, ప్రతి వ్యక్తి ఎదగడం కావాలి. అందుకోసం మహిళలకు సాధికారత అవసరం ,నిజంగా సమాజంలో ఈ సాధికారత రుపుదాలుస్తుందని ఆశిస్తూ. మనసార అభినందనలు తెలియజేస్తూ  మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
                         
                                                                                                         - రవి రాఘవేందర్

Comments