యూత్ పార్లమెంట్-2016 @ఎడ్యుకేషన్ పాలసీ



                 అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని Youth for Better India and Foundation for Democratic Reforms నిర్వహించిన యూత్ పార్లమెంట్-2016 కార్యక్రమాని ఉస్మానియా యూనివర్సిటీలో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల విద్యావిధానంలో  తీసుకోవలసిన మార్పులను గురించి దేశంలో మార్పు కోసం పని చేస్తున్న వివిధ సంస్థల ప్రతి నిధులు, సామాజిక సేవలో నిమిత్తం అయిన యువత దేశంలో నాణ్యమైన విద్య అందరికి ఎలాగా అందించవాచో, విద్య ప్రమాణాలను పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి,స్కూళ్ల ఏకీకరణ, భోదన మాధ్యమాలు, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం,స్ధానిక ప్రజల నేతృత్వంలో జవాబుదారీతనం,పాలనా వంటి కీలక మైన ఐదు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించి వారి సూచనలను, సలహాలను అందించడం జరిగింది.
                  ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యావిధానం (2016) ముసాయిదాలోని అంశాలకు సూచనలను సలహాలను ప్రతిపాదిస్తూ లోక్ సత్తా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ రూపొందించిన విద్య డాక్యూమెంట్ ను ఆధారం చేసుకొని దేశంలో నాణ్యమైన విద్య కోసం పని చేస్తున్న వివిధ సంస్థలను (YBI,TFI, PRATHAM,YBN,PAC,VnU,WETHEPEOPLE,YBS,UWH,SFL,VFS,YUVAVARADHI,VIDYARDHI SATTA,ARF,NIRMAN ) వారందరి తో  పాటుగా విద్యార్థులు వారి సూచనలను సలహాలను అందించడం జరిగింది , సామజిక సేవ చేస్తున్న యువతను ఓకే తాటి పైకి తీసుకు రావడం కోసం, వారి సూచనలను, సలహాలను ప్రభుత్వానికి వినిపించడానికి, పార్లమెంట్ పట్ల గౌరవాన్ని,రాజకీయాల్లోనమ్మకాన్ని, ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన చర్చను భాగస్వామ్యం చెయ్యడం జరిగింది.                                                                                                       విద్యా హక్కు చట్టం లోని  వైఫల్యాలను పునరావృతం చెయ్య కుండా ఎలాంటి ప్రమాణాలు విద్యలో అందించాలో అన్న అంశాల మీద చర్చించడం జరిగింది , పెద్ద సంఖ్యలో డ్రాపౌట్లలను , విద్యలో ప్రమాణాలు లేకపోవడం ,సుషిక్తులైన ఉపాధ్యాయుల కొరత , వృత్తి ఒకేషనల్ కోర్స్ లకు తాగింనని సంస్థా గత ఏర్పాట్లు లేక పోవడం వంటి లోపాలతో పాటు స్కూల్ చదువుకు వున్నత విద్య కు మధ్య సంబంధం తెగి పోయి  విద్య వ్యాపారం గా మారటం వంటి వైఫల్యాలను గుర్తిస్తూ దేశ ప్రయోజనాల కోసం పని చేసే యువతను తయారు చేసే సమిళిత విద్య వ్యవస్థను అందించాలనే తపన ప్రభుత్వ ముసాయిదా కానీపించినప్పటికీ , విద్య విధానాన్ని ఇంకా స్పష్టత , సరైన దిశా నిర్ధేశం అవసరమ అందుకు సంబంధించిన సూచనలు, సలహాలు మీద చర్చ చెప్పటడం జరిగింది.
              మనదేశంలో పాఠశాల విద్య మీద జరిగిన పిసా సర్వే ,ఆసరా సర్వ్ లు మన దేశంలో పాఠశాల విద్యార్థులలో ఉండవలసిన ప్రాదుమికా స్ధాయిలో వుండవలసిన ప్రమాణాలు కూడా లేవన్న సంకేతాలను హెచ్చరిస్తున్నాయి, నేర్చు కున్న చదువు లో ఎలాంటి ప్రమాణాలు పెంచాలి, ప్రభుత్వ గుర్తింపు  వున్నా ప్రయివేటు స్కూళ్లలో తల్లి తండ్రులకు నచ్చిన పాఠశాలలను ఎంపిక చేసుకుంటే ప్రభుత్వమే ఫీజులు చెల్లించడం, ఉపాధ్యాయుల జీతాలనుండి విద్యార్థుల ఫీజు వైపు విద్య విధానాన్ని క్రమంగా మర్చి విద్యార్థుల సంఖ్యను జీతాలకు ముడి పెట్టడం, వివిధ స్కూలు మధ్య పోటీ వాతావరణం , స్ధానిక పరిస్థితులకు తగ్గ ఏర్పాట్లు , జవాబుదారీ తనానికి బలమైన వ్యవస్థ లు , స్వయం దిద్దు బాట్లు ఏర్పాట్లు,కీలకంగా  విద్య ప్రమాణాలను పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి,స్కూళ్ల ఏకీకరణ, భోదన మాధ్యమాలు, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం,స్ధానిక ప్రజల నేతృత్వంలో జవాబుదారీతనం,పాలనా వంటి అంశాల చుట్టూ ఐదు విభాగాలుగా కేంద్ర ప్రభుత్వ నికి ఆచరణాత్మక సవరణలను , సూచనలను అందివుంచడం కోసం ఒక్క ప్రయత్నం జరిగింది.



             
            ఈ తరానికి చరిత్రలో ఏనాడూ లేనన్ని అవకాశాలు, వనరులు, ఎప్పుడు లేనంత  టెక్నాలజీ , వాటిని   ఉపయోగించుకునే శక్తి సామర్ధ్యాలు , ప్రతిభ పాటవాలు మనకున్నాయా లేదా అందుతాయా లేదా అది ఛాలెంజ్ అవుతుంది. కానీ ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, ఎంత పని కోస్తారు సమాజానికి మీకు ఎంత పనికొస్తారు సమస్యలను ఈమెకు పరిష్కరిస్తారు అన్నది ముఖ్యం. కేవలం పరీక్షలు మార్కులు ర్యాంకులు అంట కంటే ముర్కత్వం ఉండదు. మన  దేశంలో నూటికి 70 % యువతే, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఏదేశానికి  లేనటువంటి యువ నాయకత్వం ఉండవలసింది పోయి, యువతను రాజకియ్యాలో కి ఆహ్వానించే పరిస్థితి వచ్చింది, దేశాన్ని మార్చాలన్న సంకల్పం నిజాయితీ, చిత్తశుద్ధి, ధీమా వున్నవాళ్లు ను , యువత లో వున్నా ఆదర్శాన్ని ఆవేశాన్ని నిర్మాణాత్మకం మలిచి సమాజంలో మౌలికమైన మార్పును తెచ్చే శక్తిని యువతలో తీర్చి దిద్దటమే లక్ష్యంగా 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో విద్య ప్రమాణాలు ఎందుకు దిగ జారుతున్నాయి,వివక్ష లేకుండా అందరికి విద్యనందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చెయ్యడం వాళ్ళ జరిగే అపార నష్టం నుండి దేశాన్ని , భవిషత్తు తరాలను కాపాడు కోవడానికి పోరాటాలు చెయ్య వలసిన అవసరం యువత పైన వుంది. గ్రామాలూ నిజ్జంగా మవుతున్నాయి , గ్రామాల నుండి యువత ఉపాధి కోసం  వలసలు పోతున్నారు , నగరాలలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు , వాళ్ళ జీవితాలను బాగుచేసే నాయకత్వాన్ని తీసుకోకపోతే  దేశానికి అపార నష్టం వాటిల్లుతుంది,అందుకు యువతలో నాయకత్వాన్ని పెంచేందుకు, మనదేశంలో ఆరోగ్యకరమైన చర్చలను, సూచనలను సలహాలను తీసుకోవడం కోసం ఇలాంటి యూత్ పార్లమెంట్-2016 @ఎడ్యుకేషన్ పాలసీ మీద మరి కొన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
                                                                         

                                                                          https://www.facebook.com/YouthParliamentprogram

Comments